Gold Price Today : దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.240 తగ్గి.. ప్రస్తుతం రూ.60,330 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.630 క్షీణించి.. ప్రస్తుతం రూ.69,000గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం సుమారుగా రూ.240 తగ్గి.. శుక్రవారం 60,155 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.630 తగ్గి బుధవారం రూ.70,070 వద్ద ట్రేడవుతోంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,155గా ఉంది. కిలో వెండి ధర రూ.70,070గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,155గా ఉంది. కిలో వెండి ధర రూ.70,070గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,155గా ఉంది. కిలో వెండి ధర రూ.70,070గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Rate Today : అంతర్జాతీయంగా పసిడి ధరలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1929 డాలర్లుగా, శుక్రవారం నాటికి సుమారు 13 డాలర్లు దిగివచ్చి 1916 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. ఉంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ వెండి ధర 22.29 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency Prices Today : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,57,359 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,57,359 |
ఇథీరియం | రూ.1,53,953 |
టెథర్ | రూ.82.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,778 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.2 |
స్టాక్‌మార్కెట్ న్యూస్
Stock Market News : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీస్తుండడమే ఇందుకు కారణం. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 84 పాయింట్లు కోల్పోయి 63,150 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 18,720 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, మారుతి సుజుకి
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు : టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టైటాన్, ఎస్బీఐ, టాటా స్టీల్
రూపాయి విలువ
Rupee Value : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా తగ్గుతోంది. రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే ఎనిమిది పైసలు తగ్గి రూ.82.05 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Rates Today : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.