ETV Bharat / business

PF ఖాతాదారులకు షాక్ - "కొవిడ్ అడ్వాన్స్" నిలిపేసిన EPFO!

Covid Advance Facility : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఇది మీ కోసమే. మనీ విత్​డ్రా విషయంలో ఈపీఎఫ్​ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. కొవిడ్ - 19 సమయంలో చందాదారుల ఆరోగ్యం, అవసరాల దృష్ట్యా తీసుకొచ్చిన "కొవిడ్ అడ్వాన్స్" విత్​ డ్రా సదుపాయాన్ని ఆపేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Covid Advance Facility
Covid Advance Facility Cut
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 9:44 AM IST

EPFO Alert for Covid Advance Facility : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO)లో పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారందరికీ ముఖ్య గమనిక. మనీ విత్​డ్రా అంశానికి సంబంధించి ఈపీఎఫ్​ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైమ్​లో పీఎఫ్ చందాదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు తమ ఫండ్​ నుంచి కొంతమేర విత్​డ్రా చేసుకునేందుకు వీలుగా ఈపీఎఫ్​ఓ.. 'కొవిడ్ అడ్వాన్స్(Covid advance)' పేరిట సరికొత్త ఫెసిలిటీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఆ సదుపాయాన్ని ఈపీఎఫ్​ఓ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Covid Advance Facility : 2020లో మన దేశంలో కొవిడ్ - 19 విపరీతంగా విజృంభించింది. కనీసం బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో.. కొవిడ్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించింది. ఈ క్రమంలో పీఎఫ్ ఖాతాదారులు వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు..తమ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేలా "కొవిడ్ అడ్వాన్స్" సదుపాయాన్ని ఈపీఎఫ్​ఓ తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెల్త్‌ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్‌-19ను తప్పించిన నేపథ్యంలో.. ఈ ఫెసిలిటీని నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ(EPFO) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

How to Check EPFO Balance: మీ పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో.. చిటికెలో తెలుసుకోండి!

ఇకపై అలా డబ్బులు రావు : వారం రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిని బట్టి చూస్తే పీఎఫ్‌ చందాదారులు ఇకపై కొవిడ్‌ అడ్వాన్స్‌ పేరిట ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్​) నుంచి డబ్బులు విత్​డ్రా చేయడం కుదరదన్నమాట. ప్రస్తుతం ఉమాంగ్‌ యాప్‌లోకి వెళ్లి కొవిడ్‌ అడ్వాన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ‘Service not available’ అనే సందేశం కనిపిస్తోంది.

2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు : కొవిడ్‌ - 19 టైమ్​లో తీసుకొచ్చిన ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ ఫెసిలిటీ చాలా మందికి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అయితే.. ఈ కొవిడ్ అడ్వాన్స్ ఫెసిలటీని ఇంతకాలం కొనసాగించడం కారణంగా చాలామంది రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 2022-23 ఈపీఎఫ్‌ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020 మార్చి 28న ఈపీఎఫ్​ఓ తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్‌ సదుపాయాన్ని.. ఇప్పటివరకు 2.2 కోట్ల మంది వినియోగించుకున్నట్టు సమాచారం. రూ.48 వేల కోట్లను కొవిడ్‌ అడ్వాన్స్‌ రూపంలో విత్​డ్రా చేసుకున్నట్లు ఈపీఎఫ్‌ వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది.

EPFO Extends Deadline : పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్!​.. పెన్షన్​ వివరాల అప్లోడ్​ గడువు పెంపు.. లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

PF Interest 2023 : పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియ మొదలైంది.. ఇలా సింపుల్​గా చెక్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.