ETV Bharat / business

Early Retirement Plan Benefits : టూ ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్..​ లాభాలు తెలిస్తే ఇప్పుడే స్టార్ట్​ చేస్తారు! - Early Retirement Plan Benefits Business News

Early Retirement Plan Benefits : చిన్న వయస్సులోనే పదవీ విరమణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అది కూడా 30ల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తే మున్ముందు జాలీ లైఫ్ ​స్టైల్​ ఎంజాయ్​ చేయవచ్చని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. మరి దీని కోసం ఏం చేయాలి? వాస్తవానికి తొందరగా రిటైర్మెంట్​ ప్లాన్​ చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

What Is The Advantages Of Investing Early For Retirement
Early Retirement Plan Benefits In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 5:03 PM IST

Early Retirement Plan Benefits : రిటైర్మెంట్​ తర్వాత మిగిలిన జీవితాన్ని ఎవరైనా ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అయితే ఇందుకు కావాల్సింది ఆ వయసులో మీ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సరిపడా డబ్బు. ఇందుకోసం పదవీ విరమణ ప్రణాళిక అత్యంత కీలకం. మరి అటువంటి ముఖ్యమైన విషయంలో చాలామంది అలసత్వం వహిస్తూ ఉంటారు. 60 ఏళ్లు దాటిన తరువాత కదా రిటైర్మెంట్​ తీసుకోవాల్సింది.. దానికి ఇంకా చాలా సమయం ఉందిలే.. మనకి 50, 55 ఏళ్లు వచ్చాక రిటైర్మెంట్​ ప్లాన్​ను మొదలుపెట్టొచ్చనే భావనలో ఉంటున్నారు. కానీ, ఇది చాలా పెద్ద అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. 30 నుంచి 35 ఏళ్ల వయసులోనే పదవీ విరమణ ప్లాన్ ( Early Retirement Planning Benefits )​ను రెడీ చేసుకుంటే మేలని సూచిస్తున్నారు. చాలా చిన్న వయస్సులోనే పదవీ విరమణ ప్రణాళిక కోసం.. పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

20X రూల్‌ను పాటించండి!
Why Plan For Retirement Early : ఈ 20X రూల్​ అనేది మీ ఖర్చులకు సరిపడే సొమ్ముకు.. 20 రెట్లు అధికంగా మీ రిటైర్మెంట్‌ సొమ్ము ఉండాలని సూచిస్తుంది. దీని ప్రకారం రిటైర్మెంట్​ తర్వాత మన ఆర్థిక అవసరాలను అంచనా వేయడానికి ఈ 20X రూల్​ను పాటించండి. ఈ విధానం ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ, అనుకోని పరిస్థితులకు అయ్యే ఖర్చులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది. ఈ రూల్‌ సాయంతో మీ సేవింగ్స్​ను స్టార్ట్​ చేయాలి.

ఇన్ని రకాల బెనిఫిట్స్ :

రిటైర్మెంట్​ టైమ్​కు గణనీయమైన పెరుగుదల!
Benefits Of Early Retirement Planning : రిటైర్మెంట్​ కోసం ఎంత త్వరగా డబ్బును పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత మంచిది. దీని వల్ల దీర్ఘకాలంపాటు మీ పెట్టుబడిని కొనసాగించడానికి వీలవుతుంది. దీనితో మీ పెట్టుబడిపై కాంపౌండింగ్‌ (చక్రవడ్డీ) ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఫలితంగా పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో మీ చేతికి డబ్బు అందుతుంది.

ఫైనాన్షియల్​ స్ట్రెస్​ను ఎదుర్కొవచ్చు!
30లలోనే రిటైర్మెంట్( Early Retirement Plan )​కు డబ్బును ఆదా చేస్తే.. మీ పదవి విరమణ సమయానికి మంచి నిధి సమకూరుతుంది. ఇది ఆర్థికంగా ఎదురయ్యే ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనితో మిగితా జీవితాన్ని జాలీగా ఎంజాయ్​ చేయవచ్చు.

పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవచ్చు!
Portfolio Diversification Benefits : చిన్న వయసులోనే మదుపు చేయడం ప్రారంభిస్తే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మన స్ట్రాటజీలను మార్చుకొనేందుకు వీలు ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్​ గోల్స్​, ఆర్థిక అవసరాలు, మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవచ్చు.

ఊహించని ఘటనలు ఎదురైనా!
జీవితంలో ఊహించని ఘటనలు ఎదురైనప్పుడు అర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవి మన లక్ష్యాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల చిన్న వయస్సులోనే పొదుపు ప్రారంభించడం వల్ల ఎలాంటి ఆర్థిక సవాళ్లు వచ్చినా సులువుగా బయటపడవచ్చు.

దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవచ్చు!
Long Term Investment Benefits : పదవీ విరమణ అనంతరం కొందరు దీర్ఘకాలిక లక్ష్యాలను ఫిక్స్​ చేసుకుంటారు. ప్రపంచ యాత్ర వెళ్లిరావాలని​, ఏదైనా కొత్త స్కిల్​ నేర్చుకోవాలని అనుకుంటారు. అలాగే మరికొందరు మంచి బిజినెస్​ ప్రారంభించాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వారు.. తమ లక్ష్యాలను తీర్చేందుకు ప్రీ-సేవింగ్స్​ పద్ధతి అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం. దీని వల్ల మలివయస్సులో ప్రశాంతంగా మీ కోరికలు తీర్చుకోగలుగుతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.