ETV Bharat / business

91 ఏళ్ల వయసులో 'ప్రేమ'లో పడిన డీఎల్​ఎఫ్ అధినేత.. 'ఆమె' ఎవరంటే.. - డీఎల్​ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ భార్య మరణం

రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ యజమాని కేపీ సింగ్‌ 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. తన కొత్త ప్రేయసి గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే తన భార్య మరణం గురించి.. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పారు.

kp singh new wife
కేపీ సింగ్ లవ్​స్టోరీ
author img

By

Published : Feb 28, 2023, 1:43 PM IST

భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరైన తనకు ఓ తోడు దొరికిందని రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ కేపీ సింగ్‌ ప్రకటించారు. 65 ఏళ్ల వివాహ బంధం తరువాత జీవిత భాగస్వామిని కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేమని ఆయన తెలిపారు. జీవితంలో మనిషికి భాగస్వామి ఎంత ముఖ్యమో కేపీ సింగ్ వివరించారు. తన కొత్త భాగస్వామి విశేషాలను కేపీ సింగ్ ఓ ప్రముఖ ఛానల్​తో ముఖాముఖిలో వెల్లడించారు.

నా భార్యే.. నా స్నేహితురాలు!
'నాకు సంపూర్ణ మద్దతునిచ్చే స్నేహితురాలు నా భార్య ఇందిరే. మేము మంచి భాగస్వాములం. నా భార్య ఇందిరను కాపాడుకునేందుకు నేను సర్వశక్తులూ ఒడ్డాను. కానీ.. ఏవీ సఫలం కాలేదు. ఆ తరువాత నేను ఒంటరినైపోయా. మానసిక కుంగుబాటుకు గురయ్యాను. మీకు ఓ కంపెనీని నిర్వహించే శక్తిని మానసిక కుంగుబాటు వల్ల కుదరదు. మీరు 65 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్యను కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉండలేరు. భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను' అని కేపీ సింగ్ తెలిపారు.

అందుకే కంపెనీ బాధ్యతలకు దూరం..
తన భార్య ఇందిర మరణం తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు కేపీ సింగ్. అందుకే డీఎల్ఎఫ్ కంపెనీ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రేమించిన వారు దూరం కావడం, 91 ఏళ్ల వయసు వల్ల నిర్ణయాలు తీసుకునే ప్రతిస్పందన తత్వం నెమ్మదిస్తుందని ఆయన అన్నారు. కంపెనీ కోసం పనిచేసేటప్పుడు పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యమని భావించినట్లు కేపీ సింగ్ తెలిపారు. కానీ.. బాధల్లో ఉండడం వల్ల పూర్తి సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని.. అందుకే తాను యాజమాన్యం నుంచి దూరమైనట్లు కేపీ సింగ్ తెలిపారు.

"90 ఏళ్లు దాటిన తర్వాత.. ఓ లిస్టెడ్ కంపెనీ క్రియాశీల బాధ్యతల నుంచి ఎవరైనా కచ్చితంగా వైదొలగాలి. ఇక నా కుమారుడు కంపెనీ యాజమాన్య బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకున్నా. నేను ఆ పదవిలో కొనసాగే రకం కాదు. అందుకే 'గౌరవ' పదవిలో మాత్రమే కొనసాగుతున్నాను. వాస్తవానికి నా కుమారుడు నాకంటే మెరుగ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. విలువల విషయంలో రాజీపడడం లేదు. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నా."

--కేపీ సింగ్, వ్యాపారవేత్త

మిగిలిన జీవితం నాకోసం..
ఇక పని నుంచి తనను తాను దూరంగా ఉంచుకోవాలని వ్యాపారవేత్త కేపీ సింగ్‌ భావిస్తున్నారు. ఇక నుంచి తనకు ఇష్టమైన పనులు చేయడం కోసం సమయాన్ని వెచ్చించుకుంటానని కేపీ సింగ్ చెబుతున్నారు. 'నాకు ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు. వారి ఇప్పటికీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను గోల్ఫ్‌ ఆటగాడిని.' అని సింగ్ తెలిపారు.

సరికొత్త భాగస్వామ్యంపై..
చనిపోవడానికి 6 నెలల ముందు ఓ రోజు నా భార్య ఇందిర నా వద్దకు వచ్చి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు సింగ్. జీవితంలో చేస్తున్న పనులను వదిలేయవద్దని కోరినట్లు కేపీ సింగ్ చెప్పారు. సంతోషంగా జీవించే జంట కోరిక ఒక్కటే.. జీవిత ప్రయాణంలో ఇద్దరూ కలిసి వెళ్లాలని. ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలిపోకూడదు. కానీ నా విషయంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నించావు. కానీ, కొన్ని నెలల్లో నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నా. అందుకే లేకపోయినా నిరాశపడొద్దు. నీ ముందు చాలా జీవితం ఉంది. నాకో మాటివ్వు.. నేను లేకపోయినా నీ జీవితంలో నిరాశపడకు. అది ఏరకంగా నీకు సాయం చేయదు.' అని కోరినట్లు సింగ్‌ చెప్పారు.

2018లో ఇందిర మరణం తర్వాత దాదాపు రెండేళ్లు తీవ్రమైన ఒంటరితనంలో బాధపడినట్లు కేపీ సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఓ జీవిత భాగస్వామి దొరికినట్లు చెప్పారు. "నేను చాలా అదృష్టవంతుడిని. ఓ మంచి వ్యక్తిని కలిశాను. ఇప్పుడు తను నా భాగస్వామి. ఆమె పేరు షీనా. నేను జీవితంలో కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో షీనా ఒకరు. ఆమె చాలా హుషారుగా ఉంటారు. నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా చాలా అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నేను ఎప్పుడైనా నిరాశకు గురైతే.. ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. నేను ఈ రోజు ఉత్సాహంగా ఉన్నానంటే అందుకు షీనానే కారణం' అని సింగ్‌ వెల్లడించారు.

జార్జి సోరస్‌ వ్యాఖ్యలపై ఏమన్నారంటే..
అమెరికా బిలియనీర్‌ జార్జి సోరస్‌ వృద్ధాప్యం కారణంగా గౌతమ్ అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారం, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఆరోపణలపై సింగ్‌ స్పందించారు. 'ప్రస్తుతం నా వయసు ఎంత..? చాలా మంది 70 ఏళ్లు అనుకొంటారు. ఎందుకంటే నేను చాలా చురుగ్గా ఉన్నాను కాబట్టి' అంటూ సింగ్‌ పెద్దగా నవ్వేశారు.
డీఎల్‌ఎఫ్‌లో 1961లో కేపీ సింగ్‌ చేరారు. దాదాపు 50 ఏళ్ల పాటు కంపెనీలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 2020లో ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. సింగ్‌ ప్రస్తుత ఆస్తి రూ.66 వేల కోట్లు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.