ETV Bharat / business

BGauss C12i Max Electric Scooter 135km Mileage : వామ్మో.. మైలేజ్ 130 కిలోమీటర్లట​..! ఈ స్కూటర్ చూశారా..? - బిగాస్ సీ12ఐ మ్యాక్స్ ఎలక్ట్రిక్​స్కూటర్ ఫీచర్స్

BGauss C12i Max Electric Scooter Price : మార్కెట్లోకి కొత్తగా ఓ వెహికిల్ వస్తోందంటే.. దానిలో ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉండేలా చూసుకుంటాయి కంపెనీలు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ BGauss కూడా ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ని తీసుకొచ్చింది. దీంట్లో ఇతర ఫీచర్ల కన్నా.. మైలేజ్​ గురించి విని అందరూ నోరెళ్లబెడుతున్నారు..!

BGauss C12i Max Electric Scooter
BGauss C12i Max Electric Scooter 135km Mileage
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 4:19 PM IST

BGauss C12i Max Electric Scooter Price : ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విపరీతంగా దూసుకుపోతోంది. దీంతో.. తమ మార్క్ చూపించడానికి వివిధ కంపెనీలు కొత్త ఈవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన BGauss ఇటీవల అదిరిపోయే ఫీచర్లతో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను(Electric Scooter) మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఇంత.. ఆ స్కూటర్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

BGauss Launched New Electric Scooter C12i Max : మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు BGauss C12i Max. ఇది BGauss తీసుకొచ్చిన నాలుగో రకం ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 1,04,999(ఎక్స్-షోరూమ్, FAME 2, రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి). అలాగే కంపెనీ దీనిపై ప్రారంభ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఎక్స్-షోరూమ్ ధరను రూ. 97,999కి తగ్గించింది(పరిచయ ఆఫర్, స్టాక్స్ చివరి వరకు చెల్లుబాటు అవుతుంది). దిల్లీ(Delhi)లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్​షోరూమ్ ధర రూ. 1,26,153 గా ఉంది. ఇన్సూరెన్స్ రూ. Rs.4,717తో On-Road Price 1,30,870 రూపాయలుగా ఉంది. BGauss C12i మాక్స్ స్కూటర్లు బ్లూ, గ్రే, రెడ్, వైట్, ఎల్లో.. మొత్తం 5 రంగులలో లభిస్తున్నాయి. ఈ కొత్త స్కూటర్(New Scooter) ఆకట్టుకునే రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో పాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవంతో మార్కెట్​లోకి వచ్చింది.

Upcoming EV Scooters : అప్​కమింగ్​ ఎలక్ట్రిక్ బైక్స్​ ఇవే.. ఓ లుక్కేయండి!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​లోని ఫీచర్లు ఇవే :

BGauss C12i Max Electric Scooter Features in Telugu : అదిరే డిజైన్ BGauss C12i మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. ఈ స్కూటర్​లో లిథియం అయాన్ బ్యాటరీ అమర్చింది కంపెనీ. ఈ బైక్​లు 80శాతం ఛార్జింగ్​కు 4 గంటలు పైగా పడుతుంటే.. పూర్తి స్థాయిలో ఛార్జింగ్​కు 6 నుంచి 7 గంటలు పడుతోంది. ఇక దీని రేంజ్ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మోటార్ పవర్(డబ్ల్యూ)-2500, సీఏఎన్(2.0) ఎనేబుల్ టెక్నాలజీ ఉంది.

ఇంకా.. మోటర్ ఐపీ రేటింగ్-67, కంట్రోలర్ ఐపీ రేటింగ్-65, ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. బ్యాటరీకి వేడి, డస్ట్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇందులో డిజిటల్ స్పీడో మీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, యూఎస్‌బీ చార్జింగ్, సింగిల్ సీటు, ముందు వెనుక డ్రమ్ బ్రేక్స్, డిస్టెన్స్ టు ఎంప్టీ (ఎంత దూరం వెళ్లొచ్చు), ఎల్​ఈడీ లైట్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. యాప్ కనెక్టివిటీ సైతం ఉంది. దీని ద్వారా మీరు సులభంగా మీ చార్జింగ్ పాయింట్ లొకేషన్, సర్వీస్ కూపన్, యూజర్ మ్యానువల్ వంటి సేవలు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పొందవచ్చు.

Ather Scooter Launch : ఏథర్​ 450ఎస్​, న్యూ 450ఎక్స్​ లాంఛ్​.. ఫీచర్స్ అదుర్స్​.. ధర ఎంతంటే?

Ola S1 Air Sale : ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్​ స్కూటర్​.. వారికి రూ.10 వేల వరకు డిస్కౌంట్​!

కాలిపోతున్న ఈ-బైక్స్.. సేఫ్టీపై డౌట్స్.. కేంద్రం ఏం చేయబోతుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.