Banks 2 Weekly Off Proposal : భారతీయ బ్యాంకులు త్వరలో వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయా? శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులా? ఈ ప్రశ్నకు.. చాలా వరకు అవును అనే సమాధానమే వస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఇటీవలే.. బ్యాంకులు వారంలో 5 రోజులు పనిచేసేందుకు; శని, ఆదివారాలు సెలవు దినాలుగా ఉండేందుకు చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. మరి దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతుందా? లేదా? అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.
5 రోజులే పనిచేయనున్న బ్యాంకులు!
Bank Working Days In Week : ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఆమోదించిన ప్రతిపాదనలు ఒకవేళ అమలు అయితే.. అప్పుడు బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. అయితే ఉద్యోగులు మాత్రం ప్రతిరోజూ ఓ 45 నిమిషాలపాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఫైనాన్స్ మినిస్ట్రీ ఓకే అంటుందా?
Bank 2 Days Weekly Off Proposal : బ్యాంకులకు రెండు రోజుల సెలవు ప్రతిపాదన.. ప్రస్తుతం కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద ఉంది. ఈ ప్రతిపాదనకు ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదం తెలిపిన తరువాత.. తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ప్రతిపాదనను సమర్పించడం జరుగుతుంది.
బ్యాంకింగ్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి?
Bank Working Time : ప్రస్తుతం రోజువారీ నగదు లావాదేవీలు 70 శాతానికి పైగా డిజిటల్ మోడ్‌లోనే జరుగుతున్నాయి. అందువల్ల బ్యాంకుల పనిదినాలు 6 రోజుల నుంచి 5 రోజులకు కుదించినా.. ఎలాంటి సమస్య ఉండదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు!
Banking Digitalization : ప్రస్తుతం బ్యాంకింగ్ లావాదేవీలు అన్నీ చాలా వరకు డిజిటల్ మోడ్‌లో, ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అందువల్ల ఖాతాదారులు బ్యాంకులకు నేరుగా వెళ్లాల్సిన అవసరం బాగా తగ్గింది.
నిపుణుల ప్రకారం, ప్రస్తుతం బ్యాంకు బ్రాంచ్‌లు కస్టమర్ సర్వీస్ సెంటర్లలా మారాయి. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు చేయడానికి, ముఖ్యమైన పత్రాలపై సంతకం చేయడానికి మాత్రమే.. నేడు ఖాతాదారులు బ్యాంకులకు భౌతికంగా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంకు బ్రాంచులకు వెళ్లాల్సిన అవసరమే లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
- Gold Loan Vs Gold Sale : డబ్బు కోసం.. బంగారాన్ని అమ్మాలా? తాకట్టు పెట్టాలా?
- Digital Assets Management : మన డిజిటల్ ఆస్తులు.. వారసులకు అందించగలమా?
- FD VS T Bills : ఫిక్స్డ్ డిపాజిట్స్ Vs ట్రెజరీ బిల్స్.. ఏది బెస్ట్ ఛాయిస్!
- Apartment Buying Tips : మీరు అపార్ట్మెంట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ పాటించండి!