Amazon Prime Shopping Edition Plan : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుండగా, ప్రైమ్ యూజర్లకు ఒక్క రోజు ముందుగానే అంటే అక్టోబర్ 7 నుంచే ఈ మెగా సేల్ అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్ ఈ పండుగ సీజన్‌ను మరింతగా క్యాష్ చేసుకునేందుకు తాజాగా 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్' సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ఉందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా తమ యూజర్లకు అనేక బెస్ట్ బెనిఫిట్స్ కల్పించనుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ Vs అమెజాన్
Flipkart Vs Amazon Shopping Subscription : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సంవత్సర చందా రూ.499 మాత్రమే. దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు అనేక ఆఫర్స్, డిస్కౌంట్స్, హోమ్ డెలివరీ ఫెసిలిటీస్ అందిస్తోంది. దీనికి పోటీగా అమెజాన్ ఇప్పుడు 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్' ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పైగా దీని సంవత్సర చందాను కేవలం రూ.399గా నిర్ణయించింది. అయితే దీనిన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఆండ్రాయిడ్ ఫోన్లలోని.. అమెజాన్ యాప్, అమెజాన్ మొబైల్ బ్రౌజర్లలో ఈ సరికొత్త అమెజాన్ 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్' సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
బెస్ట్ బెనిఫిట్స్!
Amazon Prime Shopping Subscription Plan Benefits : అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి.. ప్రైమ్ యూజర్ల మాదిరిగానే అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. ముఖ్యంగా ఫ్రీ షిప్పింగ్, వన్డే డెలివరీ సౌలభ్యం లభిస్తుంది. అయితే ప్రైమ్ వీడియో, మ్యూజిక్, రీడింగ్, గేమింగ్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ మాత్రం ఉండవు.
తెలివిగా ప్లాన్ చేసింది!
భారతదేశంలో 650 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉన్నారు. అందులో 85 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. అందుకే వీరిని టార్గెట్ చేసుకుంది అమెజాన్. అయితే అమెజాన్ తీసుకువచ్చిన ఈ 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్' ప్లాన్ అనేది సంవత్సరం అంతా పనిచేస్తుందా? లేదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లాంటి ప్రత్యేకమైన సేల్స్ టైమ్‌లోనే పనిచేస్తుందా? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అమెజాన్ ఇప్పుడే కాదు గతేడాది కూడా.. పండుగ సేల్ టైమ్‌లో.. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను రూ.599లతో ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్ బేస్‌ను గణనీయంగా పెంచుకుంది.