ETV Bharat / business

స్టాక్‌ మార్కెట్‌లో 'మహిళా' శక్తి

కరోనా సమయంలో కొత్త ధోరణి అవలంభిస్తున్నారు మహిళలు. లాక్​డౌన్​తో జీతాల్లో కోతలు, లే-ఆఫ్​లు వంటి పరిస్థితులతో గృహావసర ఖర్చుల కోసం ఈక్విటీ మార్కెట్ల వైపు వస్తున్నారు. ఇటీవల ట్రేడింగ్​లో మహిళల భాగస్వామ్యం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

'Women' power in the stock market
స్టాక్‌ మార్కెట్‌లో 'మహిళా' శక్తి
author img

By

Published : Sep 7, 2020, 5:56 AM IST

కొవిడ్‌ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో మహిళల భాగస్వామ్యం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి కారణంగా జీతాల్లో కోతలు, లే-ఆఫ్‌లు వంటి పరిస్థితుల నేపథ్యంలో గృహావసర ఖర్చుల కోసం వారు ట్రేడింగ్‌లోకి వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) రేట్లు తగ్గిపోవడంతో మహిళలు ప్రత్యామ్నాయాల గురించి చూస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఇలా ముందుకొస్తున్న మహిళల్లో చాలామంది తొలిసారి వచ్చినవారు, అధిక సంఖ్యలో గృహిణులే కావడం విశేషం.

  • డిజిటల్‌ మార్గంలో మహిళలు స్టాక్‌ మార్కెట్‌ విజ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి లాక్‌డౌన్‌ అవకాశం కల్పించినట్లు షేర్‌ఖాన్‌ డైరెక్టర్‌ శంకర్‌ వైలయ అభిప్రాయపడ్డారు. 2020 ఏప్రిల్‌-జూన్‌ మధ్య (అంతకుమందు 3 నెలలతో పోలిస్తే) మహిళలు ఖాతాలు ప్రారంభించడం 32 శాతం పెరిగినట్లు ఆన్‌లైన్‌ సంస్థ అప్‌స్టోక్స్‌ తెలిపింది. ఇందులో 70 శాతం మంది తొలిసారి ఈక్విటీ మార్కెట్‌లోకి వచ్చినవారు కాగా.. 35 శాతం మంది గృహిణులు.
  • బంగారం ధరలు పెరుగుతుండటం, స్థిరాస్తి పెట్టుబడులు, బ్యాంకుల్లో ఎఫ్‌డీలకు తక్కువ ప్రతిఫలాలు లభిస్తుండడంతో పొదుపు ధోరణి కాస్తా.. ఆర్థిక ఆస్తులను కూడబెట్టుకునే ధోరణికి మారింది. ఇవన్నీ మహిళలను ఈక్విటీ మార్కెట్లవైపు వెళ్లేలా చేస్తున్నట్లు అప్‌స్టోక్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రవికుమార్‌ అభిప్రాయపడ్డారు.
  • అప్‌స్టోక్స్‌ గణాంకాల ప్రకారం ఈక్విటీ మార్కెట్‌లోకి వస్తున్న మహిళల్లో 74 శాతం మంది రెండో, మూడో శ్రేణి నగరాలైన విశాఖపట్నం, జైపుర్‌, సూరత్‌, రంగారెడ్డి, నాగ్‌పుర్‌, నాసిక్‌, గుంటూరు వంటి ప్రాంతాల నుంచే ఉంటున్నారు. ఈక్విటీ మార్కెట్‌లో ఉన్న మొత్తం మహిళల్లో 55 శాతం మంది ట్రేడర్లు కాగా 45 శాతం మంది ఇన్వెస్టర్లుగా ఉంటున్నారు.
  • 2020 మార్చి 1 నుంచి తాము 11 లక్షల మంది క్లయింట్లను చేర్చుకోగా ఇందులో 1.8 లక్షల మంది మహిళలలేనని జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ తెలిపారు. ఇలా వస్తున్న మహిళల సగటు వయసు 33 ఏళ్లని వివరించారు.

ఇదీ చూడండి: ట్విటర్‌ ‘వై ఈజ్‌ దిస్‌ ట్రెండింగ్’..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.