స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 410 పాయింట్లు కోల్పోయి 59,667 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 17,748 వద్దకు చేరింది. వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
- పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టైటాన్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాలను గడించాయి.
- భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.