ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- 52,200 దిగువకు సెన్సెక్స్​ - స్టాక్​ మార్కెట్​

stock market live updates
స్టాక్​ మార్కెట్ లైవ్
author img

By

Published : Jul 20, 2021, 9:38 AM IST

Updated : Jul 20, 2021, 3:45 PM IST

15:41 July 20

స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు కోల్పోయి 52,198 వద్దకు చేరింది. నిఫ్టీ 120 పాయింట్లు తగ్గి.. 15,632 వద్ద స్థిరపడింది. ఐటీ, లోహ షేర్లలో ఒడుదొడుకులు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, హెచ్​యూఎల్​, నెస్లే ఇండియా షేర్లు లాభాలను గడించాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

11:45 July 20

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 460 పాయింట్లకుపైగా పతనమై.. 52,093 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ 150 పాయింట్లకుపైగా కోల్పోయి 15,601 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, డెల్టా వేరియంట్​ కరోనా కేసుల్లో వృద్ధి (ప్రపంచవ్యాప్తంగా) నష్టాలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

  • అల్ట్రాటెక్​ సిమెంట్, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఆటో షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, భారతీ ఎయిర్​టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్​ షేర్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:39 July 20

స్టాక్​ మార్కెట్ లైవ్

స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 236 పాయింట్ల నష్టంతో 52,317 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 68 పాయింట్ల నష్టంతో 15,684 వద్ద కొనసాగుతోంది.

పవర్​గ్రిడ్​, నెస్లే, రిలయన్స్​, ఏసియన్ పెయింట్​, మారుతి​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐఎన్​, హెచ్​సీఎల్​ టెక్​, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jul 20, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.