అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులు, ఇన్ఫోసిస్ షేర్ల విలువలో భారీ తగ్గుదల, బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దేశీయ స్టాక్ సూచీలు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 86 పాయింట్లు తగ్గి 39, 212 వద్ద కొనసాగుతోంది. 9 పాయింట్ల నష్టంతో 11, 653 వద్ద జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు...
ఎస్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ, హిందూస్థాన్ యూనిలీవర్, టైటాన్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు...
ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బలపడిన రూపాయి..
రూపాయి విలువ బలపడింది. డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 27 పైసలు బలపడి 70. 87 గా కొనసాగుతోంది.
ఇదీ చూడండి: బ్యాంకు సేవలకు నేడు పాక్షిక అంతరాయం!