ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​లో బుల్​ జోరు- 60 వేలపైకి సెన్సెక్స్​ - బీఎస్ఈ సెన్సెక్స్

stock market live updates
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 1, 2021, 9:36 AM IST

Updated : Nov 1, 2021, 3:47 PM IST

15:45 November 01

బుల్​ జోరు

వరుస నష్టాలకు చెక్​ పెడుతూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, లోహ, ఇన్ఫ్రా, రియాల్టీ షేర్లు దూసుకెళ్లగా... బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ భారీ లాభాలు అందుకున్నాయి. సెన్సెక్స్​ 832 పాయింట్లు బలపడి 60,138 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 258 పాయింట్లు వృద్ధి చెంది 17,929కు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

ఉదయం 59,577 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్​.. కనిష్ఠంగా 59,355 వద్దకు చేరి, తిరిగి పుంజుకుని 60,220 గరిష్ఠాన్ని తాకింది. చివరకు 60,138 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 17,783 వద్ద ప్రారంభమై.. 17,697 వద్ద కనిష్ఠాన్ని తాకింది. వెంటనే పుంజుకుని 17,954 గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 17,929 వద్ద ముగిసింది.

లాభనష్టాలు..

ఇండస్​ఇండ్ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎయిర్​టెల్​, టాటాస్టీల్​, డా. రెడ్డీస్​, టెక్​ఎమ్​, ఎస్​బీఐ షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.

రిలయన్స్​, నెస్లే, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎం&ఎం నష్టపోయాయి.

13:59 November 01

స్టాక్​ మార్కెట్​లో బుల్​ జోరు కొనసాగుతోంది. ఫలితంగా భారీ లాభాలతో సూచీలు దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా లాభంతో.. 60,072 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా లాభంతో 17,907 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫిన్​సెర్వ్​, రిలయన్స్​, హిందుస్థాన్​ యూనిలివర్​, నెస్లే నష్టాల్లో ట్రేడవుతుండగా.. మిగినవి లాభాల్లో కొనసాగుతున్నాయి.

11:13 November 01

స్టాక్ మార్కెట్లు స్థిరంగా లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరిగి.. 59,510 వద్ద కొనసాగుతోంది.​ 79 పాయింట్ల లాభంతో 17,750 వద్ద ట్రేడవుతోంది.

లాభానష్టాలోని ఇవే..

ఇండస్​బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, టాటాస్టీల్​, డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

బజాజ్​ ఫిన్​సెర్వ్​, బజాబ్​ ఫైనాన్స్​, ఎం అండ్​ ఎం, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంకు, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:45 November 01

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు (Stocks today)  ఈ వారం తొలి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today)300 పాయింట్లకుపైగా లాభంతో 59,618 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 84 పాయింట్లు పెరిగి 17,756 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా గతం వారం​ నష్టాల నుంచి పూర్తిగా తేరుకున్నాయి సూచీలు.

అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగియడం సహా ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, టాటాస్టీల్​, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్ బ్యాంకు, ఇండస్​ బ్యాంకు టెక్​ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బజాజ్​ ఫిన్​సెర్వ్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, నెస్లె, బజాజ్​ ఆటో, డాక్టర్​ రెడ్డీస్​ ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Nov 1, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.