దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 395 పాయింట్లు వృద్ధి చెందింది. 0.75 శాతం లాభంతో 52,880 వద్ద ట్రేడింగ్ ముగించింది.
మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం భారీ లాభాలు గడించింది. 120 పాయింట్లు ఎగబాకి 15,841 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సోమవారం సెషన్లో లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 30లో ఎస్బీఐ అత్యధికంగా 2 శాతం లాభపడింది. టెక్ మహీంద్ర అధికంగా నష్టాలపాలైంది. టైటాన్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా సంస్థల షేర్లు నేల చూపులు చూశాయి.
ఇదీ చదవండి: బెజోస్‌కు ఆఖరి రోజు.. కొత్త సీఈఓ ఆండీ జాస్సీ