స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌ను (Stock Market today) నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులతో డీలా పడ్డ సూచీలు.. ప్రస్తుతం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ (Stock Market Sensex) ఓ దశలో 115 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం స్వల్ప నష్టంతో 60,050 పాయింట్ల వద్ద కదలాడుతోంది.
మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ (Stock Market Nifty) 3 పాయింట్ల నష్టంతో 17,892 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివివే...
సెన్సెక్స్ షేర్లలో టీసీఎస్ భారీగా పతనమైంది. 6 శాతానికి పైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. పవర్ గ్రిడ్, మారుతీ, కోటక్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.