ETV Bharat / business

stock market crash today: మార్కెట్​పై మళ్లీ కరోనా​ పంజా.. సెన్సెక్స్ 1688​ డౌన్​

stock market crash today: కరోనా కొత్త వేరియంట్​ వార్తలు, అంతర్జాతీయంగా లాక్​డౌన్​ భయాలతో దేశీయ సూచీలు శుక్రవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1688పాయింట్లు కోల్పోయి 57,107 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 510పాయింట్లు నష్టపోయి 17,026 వద్ద ముగిసింది.

stock market crash today, స్టాక్​ మార్కెట్లు పతనం
మార్కెట్​పై బేర్​ పంజా
author img

By

Published : Nov 26, 2021, 3:38 PM IST

stock market crash today india: దేశీయ స్టాక్​మార్కెట్​లపై బేర్​ పంజా విసిరింది. కరోనా కొత్త వేరియంట్​ దెబ్బకు బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ శుక్రవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1688​ పాయింట్లు కోల్పోయి.. 57,107 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 510పాయింట్లు నష్టపోయి 17,026 వద్ద స్థిరపడింది.

ప్రధాన కారణాలు..

  • మార్కెట్లు ఈ స్థాయిలో పతనవ్వడానికి ముఖ్య కారణం కరోనా కొత్త వేరియంట్​. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్​.. అత్యంత ప్రమాదకరమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకం వైరస్​పై టీకా ప్రభావం కూడా తక్కువేనని తెలుస్తోంది. దీంతో ఆఫ్రికా దేశాలు ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి.
  • ఐరోపా దేశాల్లో ఇప్పటికే వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలతో లాక్​డౌన్​ భయాలు మరింత పెరిగాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు అమ్మకాలవైపే భారీగా మెగ్గుచూపారు.
  • దేశీయంగా లోహ, రియల్టీ, ఆటో, బ్యాంకు రంగ షేర్లు దారుణంగా పతనమయ్యాయి.
  • ఓవైపు డాలర్​ బలపడుతుండటం, మరోవైపు వైరస్​ భయాలు పెరుగుతుండటం వల్ల విదేశీ మదుపరులు భారత స్టాక్​మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఓ కారణం. గురువారం రూ. 2,300కోట్ల అమ్మకాలు జరిపారు. మొత్తం మీద గత నాలుగు ట్రేడింగ్​ సెషన్స్​లో రూ. 15,000 కోట్ల షేర్లను అమ్మేశారు.

ఇంట్రాడే సాగిందిలా...

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో.. దేశీయ సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు.

ఉదయం 58,255 వద్ద ప్రారంభమైన బీఎస్​ఈ సెన్సెక్స్(bse sensex today live)​.. ఒక్క పాయింటు కూడా పెరగకుండా కిందకి పడింది. 56,994 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసి చివరికి 57,107 వద్ద స్థిరపడింది.

ఉదయం 17,339 వద్ద ప్రారంభమైన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ(nse nifty live today).. 17,355 వద్ద గరిష్ఠాన్ని తాకి, అక్కడి నుంచి క్రమంగా కిందపడింది. 16,985 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి వద్ద 17,026 ముగిసింది.

లాభనష్టాలు..

డా. రెడ్డీస్​, నెస్లే, సిప్లా, దివీస్​ ల్యాబ్​లు లాభాలు గడించాయి.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, మారుతి, టాటాస్టీల్​, టైటాన్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హిందాల్కో, టాటా మోటార్స్​ నష్టాలు చవిచూశాయి.

తేరుకునేదెప్పుడు?

అక్టోబర్​ 19న.. బీఎస్​ఈ సెన్సెక్స్(62,245)​, ఎన్​ఎస్​సీ నిఫ్టీ(18,604) జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి(stock market news). ఆ తర్వాత నుంచి మార్కెట్​లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే.. సూచీలు 3శాతం మేర నష్టపోయాయి. దీంతో శుక్రవారం నాడు మదుపరుల సంపద రూ.4.48లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం మీద అక్టోబర్​ 19 నుంచి ఇప్పటివరకు మదుపరులు దాదాపు రూ. 14లక్షల కోట్లు నష్టపోయారు.

వడ్డీ రేట్లను ఫెడ్​ ఎప్పుడు పెంచుతుందని మార్కెట్ల​లో ఇప్పటికే కొంత అనిశ్చితి నెలకొంది. దీనిని కొత్త వేరియంట్​ భయాలు తోడయ్యాయి. ఫలితంగా మరికొంత కాలం మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:- 'ఆ కరెన్సీలకు ప్రాథమిక విలువ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.