అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, లోహ, మౌలిక వసతులు, ఐటీ రంగంలో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సూచీలను పరుగులు పెట్టించిన క్రమంలో.. సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 12 వేల మార్క్‌ను చేరుకుంది.
ఇన్ట్రాడేలో ఓ స్థాయిలో 40,932 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ - సెన్సెక్స్ 530 పాయింట్ల లాభంతో 40,889 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుని 12, 057 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
భారతీ ఎయిర్టెల్ 7.02 శాతం మేర లాభాలను అర్జించింది. ఆ తర్వాతి స్థానంలో టాటాస్టీల్ 4.99 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.49 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.26 శాతం మేర లాభపడ్డాయి.
ఓఎన్జీసీ 2.17 శాతం మేర నష్టాలను మూటగట్టుకుంది. ఎస్ బ్యాంక్ , జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎస్, గెయిల్ నష్టాల్లో ముగిశాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకు విలువ డాలరుతో పోలిస్తే.. 16 పైసలు బలహీనపడి రూ.71.71 వద్ద ట్రేడవుతోంది.