అంతర్జాతీయ సానుకూలతల మధ్య బ్యాంకింగ్, ఫైనాన్షియల్, లోహ పరిశ్రమల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపగా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1.72 శాతం వృద్ధితో 646 పాయింట్లు లాభపడి 38,178 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజీ సూచీ-నిఫ్టీ 187 పాయింట్ల వృద్ధితో 11, 314 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
ఇండస్ఇండ్ బ్యాంకు 5.45 శాతం పెరిగి భారీగా లాభపడింది. భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల్లో ముగిశాయి.
ఎస్ బ్యాంకు సుమారు 5.26 శాతం నష్టపోయింది. హీరో మోటోకార్ప్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో షేర్లు 2.65 శాతం మేర నష్టపోయాయి.
రూపాయి..
రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 3 పైసలు నష్టపోయి రూ.70.98 వద్ద ముగిసింది.