ETV Bharat / business

2 రోజుల లాభాలకు బ్రేక్​- సెన్సెక్స్​ 535 మైనస్​ - మార్కెట్​ తాజా వార్తలు

2 రోజుల వరుస లాభాలకు బ్రేకులు వేస్తూ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, కరోనా, మాంద్యం భయాలతో ఆరంభం నుంచి మార్కెట్లు నష్టాల్లోనే నడిచాయి. సెన్సెక్స్‌ 535 పాయింట్లు నష్టపోయి 31,327 వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 9,154 వద్ద స్థిరపడింది.

MARKET
సెన్సెక్స్​
author img

By

Published : Apr 24, 2020, 3:49 PM IST

అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు, కరోనా భయాలతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. 2 రోజుల వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 31,327 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి..9,154 వద్ద ముగిసింది.

లాభాల్లో..

రిలయన్స్​, బ్రిటానియా, సిప్లా, సన్​ఫార్మా, హీరోమోటోకార్ప్​ షేర్లు లాభపడ్డాయి.

నష్టాల్లో...

బజాజ్​ఫైనాన్స్​, జీల్​, హిందాల్కో, ఇన్​ఫ్రాటెల్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ప్రపంచ మార్కెట్లు...

కరోనా దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఫ్రాన్స్​, జర్మనీ, బ్రిటన్​ మార్కెట్లు 1.5 శాతంపైనే నష్టాలను నమోదు చేశాయి.

ఆసియా మార్కెట్లు నిక్కీ (0.9%), కొస్పీ (1.3%), హాంగ్​సెంగ్ (0.6%)​, షాంఘై (1.1%) మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

కరోనా వైరస్​ వ్యాక్సిన్ అభివృద్ధి​ పురోగతిపై సందేహాలు మదుపరుల్లో ఆందోళన పెంచాయి. చైనా చేసిన క్లినికల్​ ట్రైల్​లో వ్యాక్సిన్​ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం మార్కెట్ల పతనానికి ఓ కారణమైంది.

రూపాయి....

డాలరుతో పోలిస్తే రూపాయి 40 పైసలు క్షీణించి రూ.76.46 వద్ద నిలిచింది.

చమురు ధర ఇలా...

బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్​కు 20.89 డాలర్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.