బ్యాంకింగ్, ఆటో రంగం షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంరణతో ఉదయం ఒడుదొడుకులతో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నానికి కాస్త కుదుటపడ్డాయి. అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం వెలువడనున్న దృష్ట్యా మదుపర్ల అప్రమత్తంగా వ్యవహరించారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడేలో ఓ తరుణంలో 40,645 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు.. 40,487 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూజీ- నిఫ్టీ 16 పాయింట్ల వృద్ధితో 11,937 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి..
హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు సుమారు 2.06 శాతం లాభాలతో ముగిశాయి. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంకు, మారుతి, రియలన్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ లాభాల్లోకి వెళ్లాయి.
టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఎల్&టీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు సుమారు 2.93 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 7 పైసలు లాభపడి 71.06 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: చేతక్ టు పల్సర్... హమారా 'బజాజ్'కు సారథి ఆయనే