స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 446 పాయింట్లు బలపడి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 17,822 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్ షేర్లు లాభాలను గడించాయి.
- సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.