స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex) 98 పాయింట్లు పెరిగి 51,115 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty) 36 పాయింట్ల లాభంతో 15,338 వద్దకు చేరింది.
బ్యాంకింగ్(Banking Shares), ఐటీ షేర్ల దన్ను లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే (Intraday) సాగిందిలా..
సెన్సెక్స్ 51,217 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,891 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,365 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,272 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎయిర్టెల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై లాభాలను గడించింది. నిక్కీ, కోస్పీ, హాంగ్‌సెంగ్ నష్టాలను నమోదు చేసింది.
ఇదీ చదవండి:RBI: వృద్ధి అంచనాలపై కరోనా రెండో దశ ఎఫెక్ట్