ETV Bharat / business

మార్కెట్లకు 'చమురు మంట'- సెన్సెక్స్ 550 పాయింట్లు డౌన్ - స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock Market Today: మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు కోల్పోయింది. మరో సూచీ నిఫ్టీ 195 పాయింట్లు పైగా క్షీణించింది.

Stock Market Today
మార్కెట్లకు నష్టాలు
author img

By

Published : Jan 18, 2022, 3:39 PM IST

Share Market News Today: దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెషన్​ను తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభించిన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఏ క్రమంలో కూడా మార్కెట్లు పుంజుకోలేకపోయాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 554 పాయింట్లు కోల్పోయి 60,754 వద్ద సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 18,113 వద్ద స్థిరపడింది.

ఐటీ, మెటల్​, ఫార్మా రంగాల్లో అమ్మకాల జోరు కొనసాగడం వల్ల షేర్లు భారీగా నష్టపోయాయి. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు మరింత పెరగడం కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 61,475 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,662 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,351 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,086 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

Stock Market Top Gainers:యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Stock Market Top Losers: మారుతీ, ఆల్ట్రాటెక్​ సిమెంట్​, టెక్​ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్​, టాటా స్టీల్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇదీ చూడండి:

వినియోగదారులకు షాక్​​- ఆ కార్ల ధరలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.