అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 1,128 పాయింట్ల బలపడి 50,136 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 337 పాయింట్లు పెరిగి 14,845 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
భారీగా విదేశీ పెట్టుబడులు రావడం మార్కెట్లను పరుగులు పెట్టించాయి. సెన్సెక్స్ 50,268 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,331 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,876 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,617 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, టైటాన్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల బాట పట్టాయి.