స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలను చేరి కొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు లాభపడి 60,048 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు వృద్ధి చెంది 17,853కి చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, మోదీ అమెరికా పర్యటన మదుపర్లలో ఉత్సాహాన్ని నింపడం వల్ల సూచీలు పరుగులు పెట్టాయి.
సరికొత్త శిఖరాలకు సూచీలు - సెన్సెక్స్ 160 ప్లస్ - స్టాక్ మార్కెట్లు
15:39 September 24
09:17 September 24
సరికొత్త శిఖరాలకు సూచీలు - సెన్సెక్స్ 160 ప్లస్
భారత స్టాక్ మార్కెట్లు(Stock markets) చరిత్ర సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు, హెవీ వెయిట్ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE sensex).. తొలిసారి 60వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ జీవితకాల గరిష్ఠాన్ని తాకి.. 18 వేల పాయింట్లకు చేరువలోకి వచ్చింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్.. 300 పాయింట్లకుపైగా లాభంతో 60,230కిపైగా పాయింట్లతో కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 104.55 పాయింట్ల లాభంతో 17,931 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..
టాటా మోటర్స్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్అండ్టీ షేర్లు దూసుకెళ్లాయి. ఐటీ రంగం సుమారు ఒక శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు.. హిందాల్కో, జెఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.