పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన పరిణామాలుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు కూడా కొనసాగొచ్చని పేర్కొంటున్నారు.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నగదు కొరత వంటి సమస్యలు గత వారం మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఈ వారం కూడా ఆ సెంటిమెంట్ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
గణాంకాల వెల్లడి ఎప్పుడంటే..
పరిశ్రమల ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ బుధవారం వెల్లడించనుంది ప్రభుత్వం. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మాత్రం శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత వెల్లడికానున్నాయి.
"ద్రవ్యోల్బణం, పరిశ్రమల ఉత్పత్తి, నైరుతి రుతుపవనాలపై అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్లు ఆశగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడులకు ఊతమందించే దిశగా ప్రభుత్వం చర్యలుంటాయని అంచనాలున్నాయి."
-వినోద్ నాయర్, జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ అధిపతి.
విదేశీ పెట్టుబడులు, రూపాయి, ముడిచమరు ధరలు కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయంటున్నారు నిపుణులు.
ఇదీ చూడండి: నమో 2.0: 'ఆశల పద్దు'పై ముమ్మర కసరత్తు