స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. మిడ్ సెషన్‌కు ముందు సెన్సెక్స్ 444 పాయింట్లకుపైగా కోల్పోయి 49,691 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 103 పాయింట్ల నష్టంతో 14,741 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులతో పాటు, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం వల్ల మార్కెట్లు నష్టాల బాట పట్టినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, సన్‌ఫార్మా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.