బంగారం ధర గురువారం అతిస్వల్పంగా రూ.44 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.44,347 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు (దిల్లీలో) రూ.637 తగ్గి రూ.64,110 వద్దకు చేరింది.
అంతర్జాతీంగా బంగారం ధరలు పెరుగుతుండటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం క్షీణిస్తున్న నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,733 డాలర్లకు చేరింది. వెండి ధర 24.97 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: '10 గ్రాముల పసిడీ డిపాజిట్ చేయొచ్చు'