బంగారం ధరలు శుక్రవారం కాస్త పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.251 పెరిగి.. రూ.46,615 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరల పెరుగుదలతో పాటు.. రూపాయి క్షీణత కారణంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర రూ.256 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.68,458 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,778 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 26.03 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి: పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు నిబంధనలివే!