ETV Bharat / business

చివరి గంటలో అమ్మకాలు- తగ్గిన లాభాలు

bse and Nifty indicate a positive opening for the index in India with gain
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు-15 వేలకు చేరువలో నిఫ్టీ
author img

By

Published : Apr 8, 2021, 9:25 AM IST

Updated : Apr 8, 2021, 3:48 PM IST

15:44 April 08

అల్ట్రాటెక్ సిమెంట్ 4 శాతం జంప్..

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 84 పాయింట్లు బలపడి 49,746 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 14,873 వద్ద ముగిసింది.

  • అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్​, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, బజాజ్ ఆటో, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

13:17 April 08

బుల్​ దూకుడు

టైటాన్​ 3.29 శాతం జంప్​..

స్టాక్​ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా, విద్యుత్​ రంగ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 400 పాయింట్లు పుంజుకుని..50,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకుపైగా లాభపడి..14,964 వద్ద కొనసాగుతోంది.

  • టైటాన్​, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, బజాజ్​ ఫినాన్స్, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

11:48 April 08

లాభాల్లో మార్కెట్లు...

స్టాక్​మార్కెట్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 250కిపైగా పాయింట్లు పెరిగి 49 వేల 918 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 14 వేల 910 వద్ద ట్రేడవుతోంది. 

10:05 April 08

లాభాల్లో మార్కెట్లు- 400 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ-సెన్సెక్స్ 376 పాయింట్లు లాభంతో 50,037 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 109 పాయింట్లు పుంజుకొని 14,928 వద్ద ట్రేడ్​ అవుతోంది.

సెన్సెక్స్​లోని 30షేర్ల ఇండెక్స్​లో ఓఎన్​జీసీ, బజాజ్ ఆటో, రిలయన్స్ మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆర్‌బీఐ విధాన సమావేశం నిర్ణయాలతో పాటు.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చిన నేపథ్యంలో, భారీ స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ మార్కెట్లు సానుకూలతను ప్రదర్శిస్తున్నాయి. అయితే మహమ్మారి విజృంభణతో వివిధ ప్రాంతాల్లో విధిస్తున్న ఆంక్షలతో మార్కెట్లు అస్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్, సియోల్‌ సూచీలు సానుకూలంగా ట్రేడ్​ అవుతున్నాయి. టోక్యో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:03 April 08

లైవ్​: భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 365 పాయింట్లకుపైగా బలపడి 50,026 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 117 పాయింట్లు పుంజుకుని 14,936 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది. హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫిన్​సర్వ్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎం అండ్​ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Last Updated : Apr 8, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.