ETV Bharat / business

ఏడు నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సెప్టెంబర్​లో 1.32 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాల ధరల్లో భారీ పెరుగుదల కారణంగా ఏడు నెలల గరిష్ఠాన్ని తాకింది.

author img

By

Published : Oct 14, 2020, 9:45 PM IST

WPI inflation
టోకు ద్రవ్యోల్బణం

టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 1.32 శాతం పెరిగి ఏడు నెలల గరిష్ఠాన్ని చేరింది. ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటడం వల్ల టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది.

సెప్టెంబర్​కు ముందు నాలుగు నెలలు వరుసగా డబ్ల్యూపీఐ సూచీ -3.37 శాతం (మే), -1.81 శాతం (జూన్), -0.58 శాతం (జులై​), 0.16 శాతంగా నమోదైంది.

సెప్టెంబర్​లో టోకు ద్రవ్యోల్బణం ఇలా..

  • ఆహర పదార్థాల ద్రవ్యోల్బణం 8.17 శాతంగా నమోదైంది. ఆగస్టులో ఇది 3.84 శాతంగా ఉంది.
  • కూరగాయల ధరల టోకు ద్రవ్యోల్బణం 36.54 శాతంగా నమోదైంది. బంగాళ దుంపల ద్రవ్యోల్బణం 107.63 శాతంగా ఉంది. ఉల్లిపాయల టోకు ధరల ద్రవ్యోల్బణం -31.64 శాతంగా ఉంది. పండ్ల ద్రవ్యోల్బణం -3.89 శాతంగా ఉంది.
  • పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 12.53 శాతం పెరిగింది.
  • ఇంధన, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో -9.54 శాతంగా నమోదైంది.
  • తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో 1.61 శాతం నమోదైంది.

ఇదీ చూడండి: 'అంచనాలకు మించి భారత వృద్ధి రేటు క్షీణత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.