ETV Bharat / business

క్యూ1లో జీడీపీ 20 శాతం జంప్​- కొవిడ్​ నుంచి తేరుకున్నట్టేనా? - lockdown effect on people

కరోనా మొదటి దశలో విధించిన లాక్​డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో కుప్పకూలింది. అయితే రెండో దశలో మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. 2021-22 క్యూ1లో 20.1 శాతం వృద్ధి రేటు(gdp growth rate) నమోదవ్వటమే ఇందుకు ఉదాహరణ. మరి ఈ స్థాయి వృద్ధి రేటు నమోదయ్యేందుకు కారణాలు ఏమిటి? కొవిడ్ సంక్షోభం నుంచి భారత్ తేరుకున్నట్లేనా? విశ్లేషకులు ఏమంటున్నారు?

Indian Economy
భారత జీడీపీ
author img

By

Published : Sep 1, 2021, 5:43 PM IST

కరోనా రెండో దశ విజృంభణ కొనసాగినా.. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 20.1 శాతంగా(gdp growth rate) నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం ఇటీవల వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయానికి తక్కువ బేస్​ ప్రాతిపదికన తయారీ, సేవా రంగాలు పుంజుకోవడం.. ఈ స్థాయి వృద్ధికి కలిసొచ్చిట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​(lockdown effect on indian economy) కన్నా స్థానికంగా.. అవసరం ఉన్నచోట మాత్రమే ఆంక్షలు​ విధించడం వల్ల ప్రయోజనాలు చేకూరినట్లు ఈ గణాంకాలు తేట తెల్లం చేస్తున్నాయి.

"భారీ స్థాయిలో జీడీపీ పుంజుకునేందుకు బెస్ ఎఫెక్ట్​ కారణం. కరోనా మొదటి దశ లాక్​డౌన్​ లో ఉన్నంత కఠినంగా రెండో దశలో ఆంక్షలు లేకపోవడం వల్ల ఈ స్థాయి వృద్ధి రేటుకు కలిసొచ్చింది."

- సునీల్​ సిన్హా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్​ ప్రధాన ఆర్థిక వేత్త

ఏ రంగం ప్రదర్శన ఎలా?

డిమాండ్ పరంగా నాలుగు ప్రధాన కాంపొనెంట్లలో.. మూడు (ప్రైవేటు వినియోగం, గ్రాస్​ ఫిక్స్​డ్​ క్యాపిటల్​ పార్మేషన్​, ఎగుమతులు) గత త్రైమాసికంలో సానుకూలంగా స్పందిస్తే.. దానిని డ్రివెన్ ఎకానమి అంటారు. పీఎఫ్​సీఈగా పరిగణించే ప్రైవేటు వినియోగం గత త్రైమాసికంలో 19.3 శాతంగా, గ్రాస్​ ఫిక్స్​డ్​ ఫార్మేషన్​ 55 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ప్రభుత్వ వ్యయాలు మాత్రమే గత త్రైమాసికంలో క్షీణతను నమోదు చేసిన కాంపొనెంట్​. ప్రభుత్వ వ్యయాలు ఏప్రిల్​-జూన్​ మధ్య 4.8 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సప్లయి పరంగా చూస్తే.. వ్యవసాయ రంగం 4.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. బేస్​ ఎఫెక్ట్​తో సంబంధం లేకుండానే ఈ స్థాయి వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2020 ఇదే సమయంలో కరోనా మొదటి దశ సంక్షోభం సృష్టించినా.. ఈ రంగం 3.5 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

పారిశ్రామిక వృద్ధి భళా..

2021-22 క్యూ1లో వ్యవసాయం కన్నా పారిశ్రామిక రంగం ఇంకా మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్​ ప్రధాన ఆర్థికవేత్త సునిల్ సిన్హా పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా కూడా ఇది నిలిచినట్లు తెలిపారు.

పారిశ్రామిక రంగం ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ మధ్య 46 శాతం పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెగ్మెంట్ల వారీగా చూస్తే.. నిర్మాణ (68.3 శాతం), తయారీ (49.6 శాతం), మైనింగ్​ (18.6 శాతం), విద్యుత్​, యుటిలిటీ సేవలు (14.3 శాతం) సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

భారీ వృద్ధి రేటు అయినా అది తక్కువే..

తక్కు బేస్ ఎఫెక్ట్ కారణంగా పారిశ్రామిక రంగం(industrial growth in india) ఏప్రిల్​-జూన్ మధ్య 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే కరోనా సంక్షోభం లేని 2019-20తో పోలిస్తే వృద్ధి ఇంకా క్షీణత దశలోనే ఉండటం గమనార్హం.

డిమాండ్ వైపు కూడా.. ప్రైవేటు వినియోగం, గ్రాస్​ ఫిక్స్​డ్ క్యాపిటల్ ఫార్మెషన్​ కూడా వరుసగా.. (2019-20 క్యూ1తో పోలిస్తే) 11.9 శాతం, 17.1 శాతం క్షీణత దశలోనే ఉన్నాయి.

దీని ప్రకారం చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 వృద్ధి రేటు.. 2019-20తో పోలిస్తే ఇంకా 9.2 శాతం తక్కువగానే ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

సేవా రంగంపై ఒత్తిడి..

దేశీయంగా అత్యంత ముఖ్యమైన కాంపోనెంట్​లలో ఒకటిగా పరిగణించే సేవా రంగంపై ఇంకా ఒత్తిడి(service sector in india gdp) ఉన్నట్లు సునీల్ సిన్హా అన్నారు. బేస్ ఎఫెక్ట్​తో సంబంధం లేకుండా.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో సేవా రంగం 11.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు వివరించారు.

అయితే హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్​ వంటి విభాగాలు ఇతర కాంపోనెంట్లతో పోలిస్తే కాస్త సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు సిన్హా. ఈ విభాగాలన్ని 34.3 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.