ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ భారత్‌కు వరుసగా 13వ ఏడాది 'బీబీబీ-' రేటింగ్‌ను కొనసాగించింది. ఇది తక్కువ స్థాయి పెట్టుబడితో పాటు స్థిరమైన ముఖచిత్రాన్ని తెలియజేస్తుంది. బలహీన ఆర్థిక పరిస్థితి ఈ రేటింగ్ కొనసాగింపునకు కారణమని తెలిపింది ఆ సంస్థ.
2006 ఆగస్టు 1న భారత రేటింగ్ 'బీబీ+' నుంచి 'బీబీబీ-'గా మారింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వ మధ్య కాల ఆర్థిక విధానంపైనే తదుపరి రేటింగ్ ఆధారపడి ఉంటుందని తెలిపింది.
"మధ్యశ్రేణి వృద్ధి, బలమైన విదేశీ మారక నిల్వలకు... ప్రభుత్వ రుణాలు, బలహీన ఆర్థిక వ్యవస్థ, వ్యవస్థీకృత కారణాలకు మధ్య సమతుల్యాన్ని ఈ రేటింగ్ సూచిస్తుంది."- ఫించ్ రేటింగ్స్