ETV Bharat / business

డిసెంబర్ నుంచి 24 గంటలూ ఆర్​టీజీఎస్ సేవలు - ఆర్​జీజీఎస్​ నగదు బదిలీ సమయం

తక్షణ నగదు బదిలీ వ్యవస్థ అయిన ఆర్​టీజీఎస్​పై కీలక ప్రకటన చేసింది ఆర్​బీఐ. డిసెంబర్ నుంచి ఈ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.

RTGS system to become 24x7 from December
ఆర్​టీజీఎస్ ఇకపై 24 గంటలు
author img

By

Published : Oct 9, 2020, 2:18 PM IST

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్(ఆర్​టీజీఎస్​)కు సంబంధించి వినియోగదారులకు శుభవార్త చెప్పింది భారతీయ రిజర్వు బ్యాంక్. ఆర్​టీజీఎస్​ సేవలు డిసెంబర్ నుంచి 24x7 అందుటులో ఉంటాయని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. భారీ మొత్తాల చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్ల‌డించింది.

ఏమిటి ఈ ఆర్​టీజీఎస్​..

ఆర్​టీజీఎస్​ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే.. తక్షణమే నగదు బదిలీ అవ్వడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.

భారీ మొత్తంలో నగదు బదిలీకి మరో వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది అదే నెఫ్ట్. ఈ వ్యవస్థను కూడా గత ఏడాది డిసెంబర్​ 16 నుంచి 24x7 అందుబాటులోకి తెచ్చింది ఆర్​బీఐ. ఈ వ్యవస్థలో కనీస పరిమితులు ఉండవు. దీని ద్వారా గంటలోపు నగదు బదిలీ పూర్తవుతుంది.

ఇదీ చూడండి:రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.