ఆగస్టులో వినియోగదారు ద్రవ్యోల్బణం (సీపీఐ) స్వల్పంగా తగ్గి.. 5.30 శాతంగా నమోదైనట్లు జాతీయ గణాంక విభాగం (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. జులైలో ఇది 5.59 శాతంగా ఉండటం గమనార్హం.
గత ఏడాది ఆగస్టులో సీపీఐ 6.69 శాతంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆహార పదార్థాల ధరలు తగ్గటం వల్ల.. ఆగస్టులో సీపీఐ ఈ స్థాయిలో దిగొచ్చినట్లు ఎన్ఎస్ఓ డేటా ద్వారా వెల్లడైంది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.11 శాతానికి తగ్గింది.. జులైలో 3.96 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? రూ.10 వేలు ఫైన్ ఖాయం!