ETV Bharat / business

6.09% పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం

జూన్​ నెలలో రిటైల్​ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలతో 6.09 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం గణాంకాలు విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతంగా నమోదైంది.

Retail inflation
జూన్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం 6.09%
author img

By

Published : Jul 13, 2020, 7:03 PM IST

Updated : Jul 14, 2020, 10:08 AM IST

ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలతో జూన్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం 6.09 శాతం పెరిగింది. రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కిస్తారు.

వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్​ ద్రవ్యోల్బణం 2019 జూన్​లో 3.18 శాతంగా ఉంది.

ఈ జూన్​లో ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతానికి పెరిగినట్లు సీపీఐ డేటా సూచిస్తోంది.

లాక్​డౌన్​ ఆంక్షల దృష్ట్యా పరిమిత మార్కెట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ద్రవ్యోల్బణ గణాంకాలు లెక్కించామని జాతీయ గణాంకాల విభాగం వెల్లడించింది. రాష్ట్రస్థాయిలో మెరుగైన అంచనాలను రూపొందించేందుకు తగిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ డేటా లేదని పేర్కొంది.

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్​డౌన్​ కారణంగా ఏప్రిల్​, మే నెలల్లోనూ తక్కువ మార్కెట్ల ద్వారా సేకరించిన డేటాను విడుదల చేసింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: 'మే'లో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం.. -3.21 శాతంగా నమోదు

Last Updated : Jul 14, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.