ఈ ఏడాది ఐదో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కీలక వడ్డిరేట్లపై శుక్రవారం ప్రకటన చేయనుంది ఆర్బీఐ. రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశం శుక్రవారం ముగియనుంది. వృద్ధికి ఊతమందించే దిశగా.. గతంలో మాదిరిగానే ఈ సారీ వడ్డీ రేట్లకోత ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే.. 110 పాయింట్లకోత..
ఆగస్టులో తగ్గించిన 35 బేసిస్ పాయింట్ల వడ్డీకోతతో కలిపి.. ఈ ఏడాది ఇప్పటి వరుకు నాలుగు దఫాల్లో మొత్తం 110 బేసిస్ పాయింట్లు కోత విధించింది ఆర్బీఐ. అర్థిక మాంద్య భయాలతో వృద్ధికి ఊతమందించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంది కమిటీ.
వరుస వడ్డీ కోతతో రెపో రేటు ప్రస్తుతం 5.40కు చేరింది. రివర్స్ రెపో రేటు 5.15 వద్ద ఉంది. గత నాలుగు సమావేశాల్లో రెండు సార్లు 25 బేసిస్ పాయింట్లు చొప్పున రెపో తగ్గించగా.. చివరి సమావేశంలో(ఆగస్టు) ఏకంగా 35 బేసిస్ పాయింట్లు వడ్డీ కోత విధించింది ఆర్బీఐ. అయితే ఈ సారి 25 బేసిస్ పాయింట్ల వడ్డీ కోత ఉండొచ్చనే ఆశలున్నాయి.
ఇదీ చూడండి: ఫలించిన ప్రభుత్వ చర్యలు.. ఉల్లి ధరలు తగ్గుముఖం!