క్రిప్టోకరెన్సీల ప్రభావంపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళన వెలిబుచ్చింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని అవి దెబ్బ తీస్తాయని.. ఆ విషయాన్ని ప్రభుత్వంతోనూ పంచుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
దాస్ చెప్పిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
- బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అనేది వైవిధ్యభరితమైనదని చెప్పదలుచుకున్నాను. బ్లాక్ చెయిన్ సాంకేతికత ప్రయోజనాలను అందిపుచ్చుకోవడం అన్నది వేరే విషయం. క్రిప్టోకరెన్సీపైనే మా ప్రధాన ఆందోళన. ఆర్బీఐ ఇప్పుడు సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావడంలో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రగతి కొనసాగుతోంది.
- ద్రవ్యోల్బణం ఏ శ్రేణిలో ఉందన్నదానిపై ఆర్బీఐ అంతర్గత కార్యచరణ బృందం తన నివేదికతో కొద్ది రోజుల్లో ముందుకు వస్తుంది. సరళీకృత ద్రవ్యోల్బణ లక్ష్యమనేది ప్రధాన నిర్మాణాత్మక సంస్కరణ. దీనిని ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది. గత ఐదేళ్లుగా ఈ సంస్కరణ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉన్నాయి.
- బడ్జెట్లో ప్రకటించిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది ప్రధాన సంస్కరణగా చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం ఆర్బీఐతో చర్చిస్తూనే ఉంది. ఈ విషయంలో మేం రెండు అంశాలపై దృష్టిసారించాం. ఒకటి 'ఫిట్ అండ్ ప్రాపర్'. కొత్త యజమాని అర్హతలను సాధించాలి. టోకోవర్ తర్వాత సరైన మూలధనాన్ని కల్పించగలగాలి. రెండోది ఈ ప్రైవేటీకరణకు బ్యాంక్ నేషనల్ యాక్ట్‌లో సవరణలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ సెక్యూరిటీల (జి-సెక్)తో రిటైల్ మదుపరులు నేరుగా పెట్టుబడులు పెట్టాడానికి అనుమతులు ఇస్తామని ఆర్బీఐ గత నెలలో తెలిపింద. ఈ నిమిషనలో ప్రక్రియ నుడ్సోతంది. వచ్చేకొద్ది రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేస్తాం.
ఇవీ చూడండి: