ఆర్థిక మాంద్యానికి మందు వేసేందుకు భారీ స్థాయిలో ప్రయత్నిస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ద్రవ్య లభ్యత పెంచేందుకు నిర్వహించిన రుణ మేళాలో భారీగా లోన్లను బ్యాంకులు అందించాయని ఆర్థిక శాఖ తెలిపింది.
తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రూ.81,781 కోట్లను రుణాలను ఇచ్చాయి బ్యాంకులు. ఇందులో రూ.34,342 కోట్లు కొత్త రుణాలు ఉన్నట్లు తెలిపింది ఆర్థిక శాఖ.
ఎంఎస్ఎంఈ సంస్థలకు ఊతం
బ్యాంకుల్లో తగినంత ద్రవ్య లభ్యత ఉన్నందున ఎంఎస్ఎంఇ రంగానికి పెద్ద కార్పొరేట్‌ల ద్వారా బాకీపడిన చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఎంఎస్ఎంఈలకు బిల్లు రాయితీలను కల్పించినున్నట్లు తెలిపింది.
"ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కార్పొరేట్ సంస్థలు రూ.40 వేల కోట్ల బకాయి పడ్డాయి. బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత ఉన్న కారణంగా ఎంఎస్ఎంఈలను సంప్రదించిన కార్పొరేట్ సంస్థల నుంచి చెల్లింపులు జరిగేలా చేయాలి. ఇందుకోసం ఎంఎస్ఎంఈలకు బిల్లు రాయితీలకోసం బ్యాంకులు ప్రతిపాదించాయి. దీపావళిలోపులో చిన్న పరిశ్రమలకు రావాల్సిన మొత్తాన్ని అందజేసేలా ప్రయత్నిస్తున్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
పీఎంసీ పై ఆర్బీఐతో చర్చ
పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకులో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు నిర్మలా సీతారామన్. ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని గత నెలలో రూ.25వేలకు కుదించిన నగదు ఉపసంహరణను రూ.లక్షకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలతోనే ఈ రోజు నగదు ఉపసంహరణ రూ.40వేలకు పెంపొందించింది ఆర్బీఐ.
ఇదీ చూడండి : 'అమిత్ షా'కు అస్వస్థత.. ప్రచారానికి నేడు దూరం