ETV Bharat / business

31 ఆఖరు- 4.15 కోట్ల ఐటీఆర్​లు దాఖలు - ఆదాయ పన్ను శాఖ తాజా సమాచారం

2019-20 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్​ 26నాటికి మొత్తం 4.15 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈ నెల 31లోగా పూర్తి చేసుకోవాలని సూచించింది.

Over 4.15 cr ITRs for fiscal 2019-20 filed till Dec 26
31 ఆఖరు.. 4.15 కోట్ల ఐటీఆర్​లు దాఖలు
author img

By

Published : Dec 27, 2020, 9:13 PM IST

డిసెంబర్​ 26 వరకు మొత్తం 4.15 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే డిసెంబర్​ 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగా దాఖలు చేయడం ఉత్తమం అని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఐటీఆర్​లకు సంబంధించిన వివరాలను ఈమేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది.

మొత్తం 4.15 కోట్ల మందిలో ఐటీఆర్-1కు 2.34 కోట్ల మంది, ఐటీఆర్​-4కు 89.89 లక్షల మంది, ఐటీఆర్-3కి 49.72 లక్షల మంది, ఐటీఆర్-2కి 30.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ దాఖలు చేసేందుకు ఈనెల 31 వరకు గడవుంది. ఆడిటింగ్​ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఐటీఆర్​ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు పొడిగించింది కేంద్రం.

2018-19 ఆర్థిక సంవత్సారానికి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మొత్తం 5.65 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: గడువు ముగుస్తోంది.. ఐటీఆర్ దాఖలు చేశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.