ETV Bharat / business

'వృద్ధి రేటు క్షీణత 10.6 శాతమే!' - భారత వృద్ధి రేటుపై మూడీస్ సానుకూల అంచనాలు

కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కాస్త సానుకూల అంచనాలను ప్రకటించింది మూడీస్ ఇన్వెస్టర్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ది రేటు అంచనాను -11.5 శాతం నుంచి -10.6 శాాతానికి తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'ఆత్మనిర్భర్​ భారత్​ 3.0' ఉద్దీపన నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు వెల్లడించింది.

Moody's on India growth rate
దేశ వృద్ధి రేటుపై మూడీస్ సానుకూల అంచనాలు
author img

By

Published : Nov 19, 2020, 1:56 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వద్ధి రేటుపై కాస్త సానుకూల అంచనాలను విడుదల చేసింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్'. కరోనా కారణంగా 2020-21లో భారత్ వృద్ధి రేటు -11.5 శాతంగా నమోదవుతుందని గతంలో వేసిన అంచనాను తాజాగా.. -10.6 శాతానికి సవరించింది.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు గత వారం కేంద్రం రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ తయారీ రంగం, ఉద్యోగ కల్పన, దీర్ఘ కాలిక వృద్ధి వంటి వాటిని ప్రోత్సహిస్తుందని మూడీస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వృద్ధి రేటు అంచనాలను సవరించినట్లు పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత్ వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదవుతుందని పేర్కొంది మూడీస్. ఇంతకు ముందు ఈ అంచనా 10.6 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:'నైతిక విలువలుంటేనే మంచి వ్యాపారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.