ETV Bharat / business

'అసాధారణ స్థాయిలో భారత వృద్ధి రేటు పతనం'

author img

By

Published : Sep 15, 2020, 10:30 AM IST

కరోనా మహమ్మారి కారణంగా జీ20 దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రధానంగా భారత్ వృద్ధి రేటు 25 శాతానికిపైగా పతనమైంది. 20 దేశాల్లో చైనా మాత్రమే సానుకూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు ప్యారిస్​ కేంద్రంగా పని చేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్​మెంట్ పేర్కొంది.

india gdp fall 25 pc in q2
జీ20 దేశాలపై కరోనా కోరలు

ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్​మెంట్(ఓఈసీడీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలకో జీ20 దేశాలు 6.9 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు పేర్కొంది. 2009 ఆర్థిక సంక్షోభం సమయంలో నమోదైన -1.6 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని స్పష్టం చేసింది.

దేశాల వారీగా..

ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఏప్రిల్-జూన్ మధ్య భారత జీడీపీ అసాధారణ స్థాయిలో 25.2 శాతం పతనమైనట్లు ఓఈసీడీ తెలిపింది. తర్వాతి స్థానాల్లో బ్రిటన్ (-20.4 శాతం), మెక్సికో (-17.1 శాతం) ఉన్నట్లు పేర్కొంది. ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వృద్ధి రేటు 9.1 శాతం క్షీణించినట్లు వివరించింది.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో.. జీ20 దేశాల్లో చైనా మాత్రమే సానుకూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు తెలిపింది ఓఈసీడీ. ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 11.5 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:రాష్ట్రాలకు కేంద్రం జీఎస్​టీ బకాయిలు రూ.లక్షన్నర కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.