ETV Bharat / business

2020-21 ద్వితీయార్ధం నుంచే భారత్​ పరుగులు! - ఎస్​బీఐ జీడీపీ అంచనాలు

భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం -7 శాతంగా నమోదు కావొచ్చని ఎస్​బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో వృద్ధి రేటు సానుకూలంగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది. 2021-22లో దేశ జీడీపీ అంచనాను 11 శాతం వద్ద ఉంచింది.

Indian GDP forecast by SBI Research
భారత వృద్ధి రేటుపై ఎస్​బీఐ సానుకూల అంచనాలు
author img

By

Published : Feb 10, 2021, 5:49 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో భారత వృద్ధి రేటు సానుకూలంగా నమోదు కావొచ్చని ఎస్​బీఐ రీసెర్చ్​ అశాభావం వ్యక్తం వేసింది. ఈ కారణంతో పూర్తి సంవత్సరానికి (2020-21) వృద్ధి రేటు క్షీణత అంచనాను 7.4 శాతం నుంచి 7 శాతానికి సవరించింది.

2020-21 ప్రథమార్ధంలో (ఏప్రిల్​-సెప్టెంబర్​)లో దేశ వృద్ధి రేటు 15.7 శాతం క్షీణించింది. ఒకవేళ ఎస్​బీఐ విశ్లేషణలు నిజమైతే ద్వితీయార్ధంలో వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయి.

41 హై ఫ్రీక్వెన్సీ సూచీలు 51 శాతం ప్రస్తుత ఆర్థిక సవంత్సరం మూడో త్రైమాసికం నుంచి సానుకూల వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలను సూచిస్తున్నట్లు.. ఎస్​బీఐ ముఖ్య ఆర్థిక సలహదారు సౌమ్య కాంతి ఘోశ్​ వెల్లడించారు. మూడో త్రైమాసికంలో 0.3 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చని తెలిపారు. క్యూ4లో ఏకంగా 2.8 శాతం వృద్ధి రేటు నమోద కావొచ్చని అంచనా వేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) వృద్ధి రేటు అంచనాను 11 శాతం వద్ద ఉంచింది ఎస్​బీఐ. ఇదే కాలానికి ఆర్​బీఐ ఇటీవల విడుదల చేసిన అంచనాల్లో వృద్ధి రేటు 10.5 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది. ఆర్థిక సర్వే అంచనా 11.5 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి:రూ.5 లక్షల కోట్లకు ఎస్​బీఐ గృహ రుణాల వ్యాపారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.