కరోనా సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 23.9శాతం క్షీణించింది. ఈమేరకు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) ప్రకటించింది.
2019 ఏప్రిల్-జూన్లో జీడీపీ వృద్ధి రేటు 5.2శాతంగా ఉండడం గమనార్హం.
కరోనాను కట్టడి చేసేందుకు మార్చి 25న కఠినమైన లాక్డౌన్ను విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 20 నుంచి ఆంక్షల్లో సడలింపులు చేస్తూ వస్తోంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చైనా జీడీపీ 3.2శాతం పెరిగింది. జనవరి-మార్చిలో 6.8శాతం మేర క్షీణించింది.