ETV Bharat / business

'500 బిలియన్ డాలర్లకు భారత్- అమెరికా వాణిజ్యం!' - అమెరికాతో వాణిజ్యంపై పీయుష్ గోయల్

వచ్చే ఐదేళ్లలో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య గత ఏడాది 145 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ.. వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్​ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యమని వివరించారు.

Piyush Goyal on india us trade
భారత్​ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంపై పీయుష్ గోయల్ ప్రకటన
author img

By

Published : Oct 8, 2020, 5:54 PM IST

భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే ఐదేళ్లలో మూడు రేట్లకుపైగా పెరగొచ్చని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. గత పరిమితులను దాటుకుని.. మరింత ఉదార ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ అడుగులు వేస్తున్నట్లు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అమెరికా లీడర్​షిప్ సదస్సులో వెల్లడించారు.

"అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2017లో 126 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2019 నాటికి 145 డాలర్లకు పెరిగింది. దీన్ని వచ్చే ఏదేళ్లలో 500 బిలియన్ డాలర్లకు పెంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం."

-పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి

అమెరికా పెట్టబడులను ఆకర్షిస్తోన్న భారత్..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సదస్సులో భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా వ్యాపారులకు పిలుపునిచ్చారు గోయల్.

ఇటీవల చైనాతో ఏర్పడిన వివాదాల కారణంగా అమెరికా కంపెనీలు తమ సరఫరా కార్యకలాపాలను ఆ దేశం నుంచి తరలించాలనుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా భారత్ ఇప్పటికే.. పలు రాష్ట్రాల్లో లక్ష హెక్టార్లకుపైగా స్థలాన్ని అలాంటి వారిని ఆకర్షించేందుకు సేకరించి ఉంచినట్లు గోయల్ తెలిపారు. పారదర్శకంగా, ఒరినొకరు విశ్వసించుకునే విధంగా కలిసి పని చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు అమెరికా పెట్టుబడిదారులకు వివరించారు.

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠి)

ఇదీ చూడండి:భారత జీడీపీలో 9.6 శాతం క్షీణత: ప్రపంచ బ్యాంకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.