ETV Bharat / business

ఈ లిమిట్​ దాటితే ఐటీ నోటీసులు పక్కా! - ఐటీ శాఖ నగదు వినియోగంపై పరిమితులు ఎందుకు విధించింది

నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్ను శాఖ నిబంధనలను కొన్నాళ్లుగా కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడి సాధానాల్లో నగదు లావాదేవీలపై పరిమితులు విధించింది. ఆ సాధనాలు ఏవి? వాటిపై పరిమితులు ఎంత? అనే వివరాలు మీకోసం.

Limit imposed by the IT Department on Real estate
పెట్టుబడుల్లో నగదు లావాదేవీలపై పరిమితులు
author img

By

Published : May 24, 2021, 6:57 PM IST

పెట్టుబడులు సహా పలు రకాల క్రయ విక్రయాల కోసం నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్ను శాఖ కొన్నాళ్లుగా కొత్త కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్​ ప్లాట్​ఫామ్​లు, రియల్​ ఎస్టేట్​ వంటి పెట్టుబడి సాధనాల్లో నగదు వినియోగాన్ని తగ్గించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది.

అలాంటి కొన్ని సాధానాలు, వాటిలో నగదు రూపంలో పెట్టుబడికి ఉన్న పరిమితుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

సేవింగ్స్​, కరెంట్ ఖాతాలు..

వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్​కు రూ.లక్ష పరిమితి. ఈ పరిమితి దాటినవారికి ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు.

కరెంట్ ఖాతా ఉన్నవారికి డిపాజిట్​ లిమిట్​ రూ.50 లక్షలు. ఈ పరిమితి దాటి డిపాజిట్​ చేసినవారికీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ఫిక్స్​డ్​ డిపాజిట్​ (ఎఫ్​డీ)..

ఎఫ్​డీ ఖాతాలో నగదు రూపంలో డిపాజిట్ లిమిట్​ రూ.10 లక్షలుగా ఉంచింది ఆదాయ పన్ను శాఖ. రూ.10 లక్షలకు మించి ఎఫ్​డీల్లో డిపాజిట్​ చేస్తే.. నోటీసులు పంపిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్​, స్టాక్ మార్కెట్లు, బాండ్లు, డిబెంచర్లు..

వ్యక్తిగత పెట్టుబడిదారులు.. పైన పేర్కొన్న పెట్టుబడి సాధనాల్లో రూ.10 లక్షలకు మించి నగదు రూపంలో పెట్టుబడిగా పెడితే.. ఆదాయ పన్ను శాఖ మీ ఐటీఆర్​ను తనిఖీ చేయొచ్చు.

రియల్టీ..

ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయానికి నగదు రూపంలో రూ.30 లక్షల కన్నా ఎక్కువగా చెల్లించేందుకు అనుమతి లేదని ఆదాయపు పన్ను నిబంధనలు చెబుతున్నాయి. ఈ పరిమితికి మించి నగదు రూపంలో చెల్లింపులు జరిపితే నోటీసులు ఇస్తుంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.