ఈ నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) స్వాగతించింది. బడ్జెట్ అభివృద్ధి మీద దృష్టి సారించేలా ఉందని ఐఎంఎఫ్ సమాచార విభాగం డైరెక్టర్ గెర్రీ రైస్ పేర్కొన్నారు. ఆర్థిక విధానం బలంగా ఉండటం సహా ఆర్థిక వ్యవస్ధ సమ్మిళితంగా పుంజుకునేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ ఆరోగ్యం, విద్య, ప్రజా మౌలిక సదుపాయాల మీద దృష్టి సారించిందని తెలిపిన గెర్రీ రైస్.. అది పూర్తిగా అమలైతే భారతదేశ అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని అన్నారు. ఆర్థిక పారదర్శకతను తీసుకువచ్చేందుకు బడ్జెట్లో ఆహార సబ్సిడీలను చేర్చడాన్ని కూడా ఆయన స్వాగతించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్ధను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25 పెంపు