ETV Bharat / business

IMF: భారత్‌ వృద్ధిరేటు అంచనా తగ్గింపు! - భారత జీడీపీ వృద్ధి

భారత వృద్ధి రేటు అంచనాలపై ఐఎంఎఫ్​ కీలక ప్రకటన చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతం నుంచి 9.5 తగ్గించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో దేశంలో వృద్ధి అవకాశాలు మందగించాయని పేర్కొంది.

gdp growth imf, అంతర్జాతీయ ద్రవ్య నిధి
IMF: భారత్‌ వృద్ధిరేటు అంచనా తగ్గింపు!
author img

By

Published : Jul 28, 2021, 5:47 AM IST

భారతదేశ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. 2022-23 సంవత్సరంలో వృద్ధిరేటు 8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే, ప్రపంచ వృద్ధిరేటు 6 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

మార్చి - మే నెలల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో దేశంలో వృద్ధి అవకాశాలు మందగించాయని, ఆ దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో తాజాగా ఐఎంఎఫ్‌ విశ్వాసం వ్యక్తంచేసింది.

ఇటీవల ప్రముఖ ట్రేడింగ్​ సంస్థ ఎస్​ అండ్​ పీ గ్లోబల్.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2022-23 సంవత్సరంలో ఈ వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి : అమెజాన్​ ప్రకటనతో జోష్- బిట్​కాయిన్​ హై జంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.