ETV Bharat / business

స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎలా పని చేస్తాయో తెలుసా?

author img

By

Published : Jun 28, 2021, 9:03 AM IST

స్టాక్ మార్కెట్లు.. ఏడాది కాలంగా వీటిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. కరోనా ప్రభావంతో మార్కెట్లు రికార్డు స్థాయిలో కుప్పకూలి.. తిరిగి అసాధారణంగా పుంజుకున్నాయి. ఇప్పుడు సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. దీనితో చాలా మందికి స్టాక్ మార్కెట్​పై ఆసక్తి పెరిగింది. మరి స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుంది? ఈ కాన్సెప్ట్ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

stock Exchange concept in India
భారత్​లో స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రస్థానం

స్టాక్ ఎక్స్ఛేంజీ అనేది వివిధ దుకాణాల సముదాయం లాంటి ఓ ప్లాట్​ ఫామ్. దీని ద్వారా స్టాక్​లు, బాండ్లు తదితర సాధనాల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. మన దేశంలో బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు. వీటిని.. సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రిస్తుటుంది.

స్టాక్ మార్కెట్ కూడా సాధారణ వస్తువులు విక్రయించే మార్కెట్ లాంటిదే. అయితే ఇక్కడ కంపెనీల స్టాక్​లు, ఇతర సంబంధిత సాధనాలు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.

మార్కెట్లోకి వెళ్లాక ఒక వస్తువును విక్రయించే చాలా దుకాణాలు ఉన్నట్లే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ స్టాక్ విక్రయించే వారు చాలా మంది ఉంటారు. మార్కెట్లో మనం కావాలనుకున్న ధర, దుకాణదారుడు ఇచ్చే ధర ఒకటైతే కొనుగోలు చేస్తుంటాం. స్టాక్ మార్కెట్లో కూడా ఏదైనా షేర్​ను.. కొనాలనుకున్నప్పుడు.. ఎంత ధరకు కొనుగోలు చేద్దాం అనుకుంటామో.. అవతలి వ్యక్తి కూడా అంతే ధరకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంటే.. ట్రేడ్​ పూర్తవుతుంది. కొనుగోలుదారు, విక్రయదారు మధ్య అనుసంధాన కర్తలుగా ఉండే వారే స్టాక్ బ్రోకర్లు.

డిమాండ్​ ఆధారంగా ధర..

మార్కెట్లలానే..ఇక్కడ కూడా డిమాండ్​ను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. డిమాండ్ ఎక్కువున్న స్టాక్​కు ధర పెరుగతూ ఉంటుంది. డిమాండ్ లేని వాటి ధర తగ్గతూ ఉంటుంది.

అప్పట్లో ప్రామిసరీ నోట్లు, బాండ్లు..

స్టాక్ మార్కెట్లకు ముందు చాలా విధాలుగా వాణిజ్యం జరుగుతుండేది. 1600 సంవత్సరం కంటే ముందు స్టాక్ ట్రేడింగ్ లేదు. అప్పటికీ రుణాలిచ్చే వారు డెట్​ను ట్రేడ్ చేసుకునేవారు.

బెల్జియంలో కొత్త కాన్సెప్ట్​..

1531లో స్టాక్ ఎక్స్ఛేంజీ పోలిన విధానం బెల్జియంలో ప్రారంభమైంది. ఇక్కడ వ్యాపారం, ప్రభుత్వం, వ్యక్తిగత రుణల కోసం బ్రోకర్లు, రుణ దాతలు సమావేశం అయ్యేవారు. ప్రామిసరీ నోట్లు, బాండ్లు ఇక్కడ ట్రేడ్ అవుతుండేవీ. ఆ కాలంలో ఇప్పుడున్నట్లు స్టాక్ అనే కాన్సెప్ట్ లేదు.

1600 సంవత్సరంలో డచ్, బ్రిటీష్, ఫ్రెంచ్​​ ప్రభుత్వాలు ఈస్ట్ ఇండియా కంపెనీలకు చార్టర్ ఇచ్చాయి. నౌకల ద్వారా రవాణా జరుగుతున్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉండేది. దీనిని తగ్గించుకునేందుకు ఒక్కో ట్రిప్ విషయంలో నౌక యజమానులు పెట్టుబడులను తీసుకునేవారు. ఒక్క ట్రిప్ విజయవంతం అయినట్లయితే దానికి సంబంధించి పెట్టుబడిదారులకు లాభాన్ని అందించేవారు. ఇవి ఒక్క ట్రిప్పునకు మాత్రమే వర్తించేవి. ట్రిప్ పూర్తయితే పెట్టుబడిదారుడికి, కంపెనీకి సంబంధం ముగిసేది.

ఈస్ట్ ఇండియా కంపెనీ..

ఈస్ట్ ఇండియా కంపెనీలు ప్రారంభమైనప్పుడు అన్ని ట్రిప్పులకు సంబంధించి డివిడెండ్ చెల్లించే విధంగా వ్యాపార సరళిని మార్చారు. చార్టర్ ద్వారా ఏకచత్రాధిపత్యం ఉండటం కారణంగా పోటీ అనేది లేకుండా పోయింది. దీనితో లాభాలు భారీగా ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీల షేర్లు పేపర్ల ద్వారా ఇచ్చేవారు. పేపర్ ద్వారానే విక్రయించుకునేవారు పెట్టుబడిదారులు. అప్పుడు వ్యవస్థీకృతంగా స్టాక్ ఎక్స్ఛేంజీ లేదు.

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో భారీ లాభాలను చూసిన పెట్టుబడిదారులు.. ఇలాంటి పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. చార్టర్ ద్వారా ఏర్పడిన సౌత్ సీస్ కంపెనీ.. మొదటి నౌక రవాణా చేయకముందే షేర్లను ఇచ్చింది. ఇది చాలా విజయవంతం అయింది. దీనితో ఇతర కంపెనీలు కూడా షేర్లను అందించటం ప్రారంభించాయి. సౌత్ సీస్ కంపెనీ డివిడెండ్​ చెల్లించలేకపోవటం వల్ల బబుల్ బయటపడింది. దీని అనంతరం షేర్లను అందించటాన్ని ప్రభుత్వలు నిషేధించించాయి.

లండన్​లో మొదటి స్టాక్ ఎక్స్ఛేంజీ 1773లో ప్రారంభమైంది. అయితే షేర్లను అందించటంలో అనేక నియంత్రణలు ఉండేవి. 19 ఏళ్ల తర్వాత న్యూయార్క్ ఎక్స్ఛేంజీ ఏర్పడింది. ఇది ఇప్పటికీ పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా ఉంది.

భారతదేశంలో

భారతదేశంలో మొదటి వ్యవస్థీకృత స్టాక్ ఎక్స్ఛేంజీ ముంబయిలో 1875లో ప్రారంభమైంది. ఇది ఆసియా ఖండంలోనే మొదటి స్టాక్ ఎక్స్ఛేంజీగా ఘనత సాధించింది. 1992లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఏర్పాటైంది. 1994నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.