రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.19 లక్షల కోట్లకు పెంచే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన వెలువడొచ్చని వెల్లడించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వం ప్రతి ఏటా ఈ క్రెడిట్ టార్గెట్ను పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే 2021-22కు గాను ఈ లక్ష్యం రూ.19 లక్షల కోట్లకు పెంచే అవకాశముందని అభిజ్ఞవర్గాలు పేర్కొన్నాయి.
సాధారణంగా వ్యవసాయ రుణాలకు వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే స్వల్ప కాలిక రుణాలతో వ్యవసాయానికి ప్రోత్సాహమందించేందుకు.. 2 శాతం వడ్డీ సహాయాన్ని అందిస్తోంది. దీనితో పాటు గడువులోపు రుణాలు తిరిగి చెల్లిస్తే వారికి అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఫలితంగా మొత్తం వడ్డీ 4 శాతమే అవుతుంది.
ఇదీ చూడండి:2021లో భారత వృద్ధి రేటు 7.3%: ఐరాస