ETV Bharat / business

'కరోనా 2.O వల్ల రెండంకెల వృద్ధి రేటు కష్టమే!'

కరోన రెండో దశ విజృంభణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఈ సారి కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న మినీ లాక్​డౌన్​లు, ఇతర ఆంక్షల కారణంగా వృద్ధి రేటు 2021-22లో 10 శాతంలోపే నమోదవ్వచ్చని చెబుతున్నారు.

Negative expectations on Growth rate
వృద్ది రేటుపై కొవిడ్ కోరలు
author img

By

Published : Apr 27, 2021, 7:00 AM IST

దేశాన్ని కొవిడ్ రెండో దశ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 10 శాతంలోపే నమోదవ్వచ్చని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్​ చంద్ర గార్గ్​ అంచనా వేశారు.

వృద్ధి రేటుపై వివిధ అంచనాలు..

  • కరోనా రెండో దశ విజృంభణకు ముందు 2021-22కు సంబంధించి భారత్ వృద్ధి రేటుపై అత్యంత సానుకూల అంచనాలు వచ్చాయి.
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) 12.5 శాతం, ఆర్థిక సర్వే 11 శాతం, ఆర్​బీఐ 10.5 శాతం వృద్ధి రేటును అంచనా వేశాయి. వివిధ రేటింగ్ ఏజెన్సీలు, ఎస్​బీఐ లాంటి బ్యాంకింగ్ దిగ్గజాలు కూడా రెండంకెల వృద్ధి నమోదవ్వొచ్చని ధీమా వ్యక్తం చేశాయి.
  • అయితే కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాల్లో విధిస్తున్న మినీ లాక్​డౌన్​లు, ఇతర ఆంక్షలు వృద్ధికి ఆటంకాలుగా మారుతున్నట్లు గార్గ్ ఓ బ్లాగ్​లో రాసుకొచ్చారు.
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ తీవ్రతను అంచనా వేయడం కష్టమన్నారు గార్గ్​. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ప్రజల ఎలా స్పందిస్తారు అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
  • గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 24 శాతం మేర క్షీణించగా.. ఈసారి 15-20 శాతం మేర డీలా కనిపించవచ్చని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:'కరోనా ఉద్ధృతి ఉన్నా.. సంస్కరణలు ఆగవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.